మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని రష్మిక మందన తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం , అలాగే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు అనేక ఇంటర్వ్యూ లలో , ఈవెంట్ లలో పాల్గొని ఈ సినిమా అద్భుతమైన సినిమా అని , ఈ మూవీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చెబుతూ వచ్చారు.

దానితో ఈ సినిమాపై ఆడియన్స్ లో మరింత అంచనాలు పెరిగాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ మూవీ కి నార్త్ అమెరికా లో మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఇప్పటివరకు నార్త్ అమెరికా లో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికం గా ప్రకటిస్తూ పోస్టర్ను విడుదల చేశారు.

పోస్టర్ ప్రకారం ఈ మూవీ కి నార్త్ అమెరికా లో ఇప్పటివరకు 250 కే ప్లస్ కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించింది. ఈమె కు ఈ మూవీ లోని నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను రాహుల్ రవీంద్రన్ కి కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm