రాజమౌళి దర్శకత్వంలో ప్రియాంక పాత్ర కీలకంగా, కథను ముందుకు నడిపించే స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్‌గా ఉండబోతుందని సమాచారం. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 11, 2025న ప్రత్యేకంగా రిలీజ్ చేయనున్నారని టీమ్ వెల్లడించింది. ఆ పోస్టర్‌తో పాటు ఆమె పాత్ర పేరు కూడా రివీల్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేక ప్రమోషనల్ టీమ్‌ను ఏర్పాటు చేసి, గ్లోబల్ లెవెల్‌లో ప్రచారం చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పోషిస్తున్న “కుంభ” పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై, అభిమానుల్లో భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఆ పోస్టర్‌కి వచ్చిన స్పందనను చూస్తేనే సినిమా స్థాయి ఏమిటో అర్థమవుతోంది.
ఇకపోతే, అందరి కళ్లూ ఇప్పుడు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌పై పడిపోయాయి. మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని సమీప వర్గాలు చెబుతున్నాయి. ఆయన పాత్ర పేరు, లుక్, స్టైల్ అన్ని రాజమౌళి సినిమాకు తగిన రీతిలో సర్ప్రైజ్‌గా ఉండబోతున్నాయట. ఫస్ట్ లుక్‌తో పాటు సినిమాకి టైటిల్‌ను కూడా ఒకేసారి రివీల్ చేయాలని యూనిట్ భావిస్తోంది.ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఈ చిత్రం రూపొందబోతోందని టాక్. రాజమౌళి అంటే టైమ్ టేకింగ్ ఎక్కువ అంటుంటారు జనాలు. కానీ ఈసారి మాత్రం టైం వేస్ట్ లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. కొంతమంది మన రాజమౌళి మారిపోయాడు అంతున్నారు..!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి