హీరోయిన్ ఆదాశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. నితిన్ హీరోగా నటించిన హార్ట్ ఎటాక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో క్యూట్ నటనతో బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలను సెకండ్ హీరోయిన్గా నటించిన పెద్దగా ఆకొట్టుకోలేదు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా సినిమాలనే కాకుండా విభిన్నమైన పాత్రలలో నటిస్తూ పేరు సంపాదించింది ఆదాశర్మ. ఆదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ ఇండస్ట్రీలోనే ఒక సంచలనం సృష్టించింది.


ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించగా పలు వివాదాలను కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమాపై ఎక్కువగా బైకాట్ అంటూ నినాదాలు కూడా నడిచాయి. ఈ సినిమా విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు చిత్ర బృందం. ముఖ్యంగా ఈ సినిమా విడుదల సమయంలో కూడా ఎన్నో అడ్డంకులు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని తెలియజేసింది ఆదాశర్మ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని విషయాలను బయట పెట్టింది.


ముఖ్యంగా చాలామంది తనని చంపేస్తామని బెదిరించారని.. చాలామంది కాల్స్ చేసేవారని,అయితే ఈ విషయంపైన తాను ఎప్పుడూ కూడా భయపడలేదు ముందు నుంచి తాను ధైర్యమైన కథలను ఎంచుకోవాలనుకున్నాను అందుకే ది కేరళ స్టోరీ సినిమా కథ వినాగానే ఓకే చెప్పాను .ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా విడుదలైన సమయంలో సగం మంది నన్ను చంపాలని చూశారు. మిగిలిన సగం మంది మాత్రం తనను కాపాడుతూ వచ్చారంటూ తెలిపింది. ఎన్నో సవాళ్లతో కూడిన పాత్రలను ఎంచుకున్నాను.. యాక్షన్ పాత్రలు , ఎమోషన్ పాత్రలు , ఛాలెంజింగ్ పాత్రలు వంటివి అంటేనే నాకు చాలా ఇష్టమని కొన్నిసార్లు ఇలాంటి బెదిరింపుల వల్ల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. కానీ నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నానని తెలిపింది ఆదాశర్మ. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: