తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో రాజమౌళి ప్రధమ స్థానంలో ఉంటారు. రాజమౌళి "స్టూడెంట్ నెంబర్ 1" అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు వరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని దానితో ఈయనకు దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే రాజమౌళి దాదాపు సినిమా కథను దాచిపెట్టడు.

సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఆయన ఏదో ఒక సందర్భంలో సినిమా కథ నేపథ్యం చెబుతూ ఉంటాడు. దానితో ప్రేక్షకులు కథపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా కేవలం స్క్రీన్ పై మాత్రమే అంచనాలు పెట్టుకుంటారు. దానితో రాజమౌళి కూడా తనపై , తన సినిమాపై అంచనాలను తగ్గించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా సినిమాను రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే స్టార్ట్ అయింది. దానితో చాలా మంది రాజమౌళి ఎప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కథ ను లేదా నేపథ్యాన్ని చెబుతాడా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

ఈ రోజు రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాకు సంబంధించి అత్యంత పెద్ద ఈవెంట్ను ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసిన ఈవెంట్ ద్వారా ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ఒక వీడియో ద్వారా ఈ మొవు్ ద్వారా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటివరకు రాజమౌళి ఎప్పుడు సినిమాకు సంబంధించి మొదటి ఈవెంట్ నే ఇంత గ్రాండ్గా చేయలేదు. దానితో రాజమౌళి , మహేష్ మూవీ ద్వారా చేసిన ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: