మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన మలయాళ నటుడు అయిన కూడా తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించి ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన తెలుగులో నేరుగా మహానటి , సీత రామం , లక్కీ భాస్కర్ అనే మూడు సినిమాలలో నటించాడు. ఈ మూడు మూవీలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. తాజాగా ఈయన కాంత అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తెలుగు ప్రేక్షకుల నుండి అంత గొప్ప టాక్ రాలేదు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్థాయి కలెక్షన్లు దక్కడం లేదు. మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 48 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 6 లక్షలు , ఆంధ్ర లో 52 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.06 కోట్ల షేర్ ... 1.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 8.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 8.44 కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: