అయితే ‘వారణాసి’ టైటిల్‌ను ప్రకటించడానికి ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చూసి ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఈ సినిమా స్థాయి, రాజమౌళి తీసుకున్న గ్లోబల్ ప్లానింగ్ ఎంత పెద్దదో మరోసారి సూచించింది.ఈ చిత్రాన్ని సాయి దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. కానీ గత రెండు రోజులుగా ఈ సినిమా చుట్టూ ఒక ఆసక్తికర టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ టాక్ ప్రకారం—‘వారణాసి’ కోసం నిర్ణయించిన బడ్జెట్ ఊహించిన దానికంటే మరింత భారీగా పెరిగిందని, ఆ భారీ బడ్జెట్‌ను ఖ్ళ్ నారాయణ ఒంటరిగా మేనేజ్ చేయడం కష్టంగా మారిందని అంటున్నారు.
దీంతో రాజమౌళి స్వయంగా ఫైనాన్షియల్ రిస్పాన్స్‌బిలిటీ కూడా తీసుకుంటూ, తానే నిర్మాతగా మారి అదనపు నిధులను సమకూరుస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే తన పేరుకి ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసు. ఆయన కొడుక్కి కూడా అదే క్రేజ్ రావాలని కార్తికేయ ని ప్రొడ్యూసర్ గా మార్చారట. అంటే ఈ సినిమా కేవలం క్రియేటివ్ పరంగానే కాకుండా, ప్రొడక్షన్ పరంగాను కూడా రాజమౌళి పర్సనల్‌గా ఇన్వాల్వ్ అయ్యేంత పెద్ద స్కేలు ప్రాజెక్ట్‌గా మారిపోయిందనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.ఇన్ని అంచనాలతో, ఇంత భారీ ప్రణాళికలతో వస్తున్న ‘వారణాసి’ మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, భారత సినిమా చరిత్రలోనూ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి