- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఈ కాంబో ఇప్పటికే ఇచ్చిన బ్లాక్‌బస్టర్‌లకు కొనసాగింపుగా వస్తున్న అఖండ 2 కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అఖండ‌కు సీక్వెల్ కావ‌డంతో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు బాలయ్య మాస్ గూస్‌బంప్స్‌ను గుర్తు చేస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఇదిలా ఉండగా, ట్రైలర్‌పై ఏర్పడిన ఆసక్తిని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్, అధికారిక ప్రకటన విడుదల చేశారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం నవంబర్ 21 సాయంత్రం 6 గంటలకు అఖండ 2 ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేస్తున్నారు.

 

అఖండ 2 టీం ముందుగానే వెల్లడించినట్లుగా ఈ ఈవెంట్ క‌ర్నాట‌క‌లోని చింతామణి ప్రాంతంలో జరగనుంది. అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో యూనిట్ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. అదే సమయంలో ఈ ఈవెంట్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. బాలయ్య - శివ రాజ్ కుమార్ ఒకే వేదికపై కనిపించబోతుండటం రెండు నటుల అభిమానులకు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ అనౌన్స్‌మెంట్ వైరల్ అవుతూ, అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.


ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌? థమన్ సంగీతం అందిస్తుండగా, థ‌మ‌న్ ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ స్కేల్, బోయపాటి స్టైల్ మాస్ యాక్షన్, బాలయ్య యొక్క రెండు భిన్న షేడ్స్ అన్నీ క‌లిసి అఖండ 2 కోసం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ విషయానికి వచ్చితే డిసెంబర్ 5న సినిమాను గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అఖండ విజయాన్ని మరింత పెంచుతూ ఈ సీక్వెల్ కూడా అదే స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా ?  రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆస‌క్తి గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: