రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితం ఈ సినిమాను నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను కూడా ఈ మూవీ బృందం వారు నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం సడన్గా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను నవంబర్ 28 వ తేదీన కాకుండా నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో 7.74 మిలియన్ వ్యూస్ , 155.6 కే లైక్స్ లభించాయి.

ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన చాలా పాటలను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది అని , ఈ మూవీ ట్రైలర్ 24 గంటల్లో సూపర్ సాలిడ్ వ్యూస్ , లైక్స్ దక్కుతాయి అని జనాలు అనుకున్నారు. కానీ ఆ స్థాయి వ్యూస్ , లైక్స్ మాత్రం ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో దక్కలేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram