టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో  గుర్తింపును సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ పాంచ్ మినార్  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పలువురు ప్రముఖ యూట్యూబర్లతో కలిసి రాజ్ తరుణ్ ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ ఎంతగానో ప్లస్ అయ్యాయి.  ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా  రాశి సింగ్ నటించగా పాంచ్ మినార్  సినిమాకు సంబంధించి ఒకరోజు ముందే ప్రీమియర్స్  ప్రదర్శితమయ్యాయి.  ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ సాధించాడా? లేదా? ఇప్పుడు చూద్దాం.

కథ :

కిట్టు (రాజ్ తరుణ్) బీటెక్ కంప్లీట్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడతాడు.  సరైన జాబ్ దొరకక  ట్యాక్సీ డ్రైవర్ జాబ్ లో  జాయిన్ అయిన కిట్టు  కళ్ళ  ముందే అతని క్యాబ్ లో ఎక్కిన వ్యక్తి మరణిస్తాడు.  అయితే  చనిపోయిన వ్యక్తి  బ్యాగ్ లో ఊహించని స్థాయిలో డబ్బు ఉంటుంది.   కిట్టు కళ్ళ  ముందే జరిగిన హత్య వల్ల పోలీసుల నుంచి,  ఆ డబ్బు వల్ల  ఓ ముఠా నుంచి కిటుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేశారు? ఆ వ్యక్తి బ్యాగ్ లో ఉన్న డబ్బు కోసం ముఠా  ఎందుకు ప్రయత్నిస్తుంది? చివరకు కిట్టు తనకు ఎదురైన ఇబ్బందులను  ఏ విధంగా అధిగమించాడు? హత్య చేసిన వ్యక్తులను కిట్టు ఎలా పట్టుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

సాధారణంగా చార్ మినార్ అందరికీ  తెలుసు.  పాంచ్ మినార్ అనే వెరైటీ టైటిల్ తోనే  ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి.  డైరెక్టర్ రమేష్ కుడుముల క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.  రాజ్ తరుణ్ తన ఎనర్జీ లెవెల్స్ తో  పాత్రకు తగినట్టు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రాశి సింగ్ గ్లామర్, యాక్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అయింది.  బ్రహ్మాజీ, సుదర్శన్, శ్రీనివాస్ రెడ్డి  కామెడీ పాత్రల్లో కనిపించే ఆకట్టుకున్నారు.  రాజ్  తరుణ్ తన నుంచి ప్రేక్షకులు  ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి సినిమాలో నటించారు. ప్రస్తుతం థియేటర్లలో సరైన సినిమా లేక గత కొన్నిరోజులుగా థియేటర్లు వెలవెలబోతున్నాయి.  పాంచ్ మినార్ సినిమాతో ఆ లోటు తీరే అవకాశం ఉంది.

రాజ్ తరుణ్ కు ఈ సినిమా సక్సెస్ తో మూవీ ఆఫర్లు సైతం పెరిగే అవకాశాలున్నాయి.   హీరోయిన్ రాశి సింగ్ అటు నటనతో ఇటు గ్లామర్ తో మెప్పించారు.  ఆదిత్య  కెమెరా వర్క్, శేఖర్ చంద్ర మ్యూజిక్,  ఆదిత్య జవ్వడి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ అయ్యాయి.  సినిమాలో కామెడీ  సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.  కొన్ని చిన్నచిన్న మైనస్ లు ఉన్నా ఈ సినిమాను  ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించడంలో  డైరెక్టర్ సక్సెస్ అయ్యారు.

ప్లస్ పాయింట్స్ : రాజ్ తరుణ్ నటన, రమేష్ కుడుముల డైరెక్షన్,  కామెడీ  సీన్స్

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

రేటింగ్ : 3.0/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: