వారణాసి మూవీ ఈవెంట్ జరిగినప్పటినుండి రాజమౌళి పై హిందువుల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు రాజమౌళిని టార్గెట్ చేసి మరీ దేవుళ్ళు అంటే ఇష్టం ఉండదు. కానీ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని కోట్లు సంపాదిస్తావా అంటూ మండి పడుతున్నారు.అంతేకాదు వెంటనే మీడియా ముందుకు వచ్చి హిందూ బాంధవులకు క్షమాపణలు చెబితే సరి.. లేకపోతే నీ సినిమాలు విడుదల కానివ్వం.. సినిమాలను ఆడనివ్వం.. నీ అంత చూస్తాం అన్నట్లుగా రాజమౌళికి వార్నింగ్ లు ఇస్తున్నారు వివిధ హిందూ సంఘాల నేతలు. అయితే గత కొద్ది రోజుల నుండి రాజమౌళి పై ఇన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన బయటకు వచ్చి ఈ వివాదం గురించి స్పందించడం లేదు. బహుశా రాజమౌళికి ఈ విషయం తెలుసో లేదో అని కొంతమంది అంటుంటే..తెలిసినా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు అని ఇంకొంతమంది అంటున్నారు. 

ఏది ఏమైనప్పటికీ ఇంత నెగిటివిటీ వస్తే రాజమౌళి కుటుంబంలోని ఏ ఒక్కరు కూడా దాన్ని చూడరా.. ఆయనకు తెలిసినా కూడా సైలెంట్ గా ఉంటున్నారని మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రమా రాజమౌళి చేసిన కామెంట్లు బిజెపి వాళ్లకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉంది.మరి ఇంతకీ రమా రాజమౌళి చేసినా ఆ కామెంట్లు ఏంటంటే..రాజమౌళికి డబ్బు మీద అస్సలు వ్యామోహం ఉండదు. ఆయన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. బయటికి వెళ్తే జేబులో ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. నేనే ఆయన కార్ డ్రైవర్ కి క్యాష్, కార్డు ఇచ్చి పంపిస్తా.ఎందుకంటే మార్గమధ్యంలో ఎక్కడైనా డబ్బు అవసరం ఉంటుందని. ఆయనకసలు డబ్బు మీద ద్యాసే ఉండదు..

ఆయన డబ్బుల గురించి అస్సలు ఆలోచించరు అంటూ రమా రాజమౌళి చెప్పుకొచ్చింది. అయితే రమా రాజమౌళి చేసిన కామెంట్లు పాతవే అయినప్పటికీ ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.దానికి కారణం రాజమౌళికి సంపాదన మీద ఉన్న ధ్యాస దేవుళ్ళ మీద లేదని,డబ్బు కోసం దేవుళ్ళ పేర్లు వాడుకొని హిట్స్ కొడుతున్నారు అంటూ ఈ మధ్యకాలంలో బీజేపీ నేతలు చాలామంది రాజమౌళిని విమర్శించారు. అయితే రాజమౌళిని విమర్శించిన బీజేపీ నేతలకు రమా రాజమౌళి గతంలో మాట్లాడిన మాటలు కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి అంటూ కొంతమంది రమా రాజమౌళి మాట్లాడిన పాత వీడియోను మళ్ళీ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: