వాస్తవానికి, రవి ఇన్నేళ్ల పాటు చాలా లో–ప్రొఫైల్ గా, బయటకు తెలియకుండా, పక్కా ప్లాన్ తో తన సెట్‌ప్‌ను నడిపాడని చాలా మంది చెబుతున్నారు. కొన్ని వర్గాల ప్రకారం, ఆయన అసలు సమస్యలో పడటం ఒక్క కారణం వల్లేనంటూ చర్చ సాగుతోంది—అది ఆయన పోలీసులపై విసిరిన సవాలు. సోషల్ మీడియాలో చర్చల ప్రకారం, రవికి కోపం వచ్చిన వేళ “దమ్ముంటే పట్టుకోండి చూద్దాం” అంటూ పోలీసులకు విసిరిన మాటే మొత్తం దృశ్యం మార్చేసిందట. ఆ మాటే పోలీసులను మరింత కదిలించినట్లు, కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చేసినట్లు ప్రముఖులు, నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సాధారణంగా ఇది కూడా మరో పైరసీ కేసు అని భావించి వదిలేసే అవకాశం ఉన్నా, ఈ సవాలు కారణంగా పోలీసులు దీన్ని సీరియస్ మిషన్ గా తీసుకొని నిశ్శబ్దంగా, రహస్యంగా ఆపరేషన్ నిర్వహించి చివరికి రవిని పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.చాలా మంది అభిప్రాయం ఏమిటంటే—రవి ఆ కోపంలో ఆ ఒక్క మాట చెప్పకపోయి ఉంటే, ఈరోజు ఆయన పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేదని. పైరసీ వర్క్ ఉన్నప్పటికీ, అరెస్టు వంటి ఘట్టం పెద్దగా ఎదురుకాలేదని, బహుశా ఇప్పటికి విదేశాల్లో కాళ్లు పై కాళ్లు వేసుకుని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అని చాలామంది అంటున్నారు. ఇది అంతా సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయి, సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఇదే హాట్ టాపిక్. ప్రతి రోజు కొత్త రూమర్లు, కొత్త విశ్లేషణలు, కొత్త హైప్తో ఈ విషయం మరింత వైరల్ అవుతూ సాగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి