సినిమా ఇండస్ట్రీ లో వరుస పెట్టి ఎవరికైతే విజయాలు దక్కుతాయో వారికి అద్భుతమైన సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది అనేక సార్లు కరెక్ట్ అని ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏ ముద్దు గుమ్మ అయితే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని , ఆ తర్వాత కూడా వరుస పెట్టి విజయాలను అందుకుంటుందో ఆమెకు సూపర్ సాలిడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి. ఇకపోతే వరుసగా తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాలుగు విజయాలను అందుకున్న ఓ ముద్దుగుమ్మ ఒక ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి సంయుక్త మీనన్. ఈమె పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈమె రానా కు భార్య పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన బింబిసారా , సార్ , విరూపాక్ష సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. 

ఇలా పరుసగా ఈమె నటించిన నాలుగు తెలుగు సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈమె చాలా కాలం గ్యాప్ తీసుకుంది. తాజాగా ఈమె అఖండ 2 అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ బ్యూటీ నిఖిల్ హీరోగా రూపొందిన స్వయంభు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ రెండు మూవీ లతో ఈమె ఏ స్థాయి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm