మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. తమన్నా తన కెరియర్లో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తెలుగు మూవీ ల ద్వారానే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కోనసాగిస్తున్న సమయం లోనే ఈమె తమిళ సినిమాలలో కూడా నటించింది. ఈమె తన కెరీర్లో ఎన్నో తమిళ సినిమాలు నటించి , ఎన్నో విజయాలను కోలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్గా కేరిర్ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈమెకి అవకాశాలు చాలా వరకు తగ్గాయి. కానీ ఈమె వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మంచి జోష్లోనే కెరియర్ను ముందుకు సాగిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ అదిరిపోయే రేంజ్ హిట్ కాంబో మూవీ లో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విశాల్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సందర్ సి కాంబో లో ఇప్పటికే కొన్ని మూవీలు వచ్చాయి.

వీరి కాంబో లో వచ్చిన సినిమాలలో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే విశాల్ , సుందర్ సి కాంబో లో రాబోతున్న నెక్స్ట్ మూవీ లో తమన్నా ను హీరోయిన్ సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో తమన్నా ను హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ గనుక మంచి విజయం సాధిస్తే తమన్నా మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: