టాలీవుడ్, బాలీవుడ్లో హీరోయిన్ గా పేరు సంపాదించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య సినిమాలలో కంటే ఎక్కువగా లవ్ రూమర్స్ విషయంలోనే తరచూ వార్తలలో వినిపిస్తోంది. గడిచిన కొన్ని నెలల క్రితం కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన హీరో ధనుష్ తో మృణాల్ ప్రేమలో ఉందని రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ ఒక టాలీవుడ్ హీరోని వివాహం చేసుకోబోతోందని ప్రచారం జరగగా , ఇప్పుడు తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన శ్రేయస్ అయ్యర్ తో డేటింగ్ చేస్తోందంటూ పలు రకాల రూమర్స్ వినిపించాయి.


ఈ విషయం పైన మృణాల్ ఒక సినిమా ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. టీమిండియా క్రికెటర్ల పైన ప్రశంసల కురిపించింది. ఆ తర్వాత క్రికెటర్ తో రిలేషన్ పై మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు మేము చాలా నవ్వుకుంటాము.. అయితే ఇలాంటి రూమర్స్ అన్నీ కూడా ఫ్రీ పిఆర్ లాంటివి.. నాకు వాళ్లు ఫ్రీగానే పబ్లిసిటీ వంటివి  చేస్తున్నారు. అందుకే చాలా ఇష్టం అంటూ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యలకు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇటీవల తన మీద వస్తున్న డేటింగ్ రూమర్స్ కి మాత్రం ఇలా కౌంటర్ ఇచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.


మృణాల్ ఠాకూర్ సినిమాల విషయానికి వస్తే.. సన్నాఫ్ సర్దార్ 2 సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలలో నటిస్తూ ఉండగా, అడవి శేషు నటిస్తున్న తెలుగు సినిమా డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా  నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మొత్తానికి డేటింగ్ రూమర్స్  పై విభిన్నంగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: