ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో నిర్మిస్తున్నారు. కథకు కావాల్సిన రఫ్ యాక్షన్ మరియు ఎమోషనల్ ఇంటెన్సిటీ కారణంగా నాని చాలా సమయం కేటాయిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.‘ది ప్యారడైజ్’ తర్వాత, నాని సుజీత్ దర్శకత్వంలో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా చేయడానికి సిద్ధమవుతున్నారు. సుజీత్ చిత్రాల్లో ఉండే స్టైలిష్ ప్రెజెంటేషన్, పర్ఫెక్ట్ టేకింగ్ నాని ఇమేజ్‌కి ఎలా కొత్త డైమెన్షన్ ఇస్తుందో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు సినిమాలతో నాని పూర్తిగా బిజీగా ఉండే అవకాశం ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే, తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్‌తో కూడా నానికి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ‘96’, ‘మేయ్యళగన్’ వంటి హృదయానికి హత్తుకునే, కంటతడి పెట్టించే కథలు తీసిన ప్రేమ్ కుమార్‌కి నాని చాలా కాలంగా అభిమాని. అనేక ఇంటర్వ్యూల్లో ఆయన ప్రేమ్ కుమార్ సినిమాలు తనకు ఎంతగా నచ్చుతాయో, వాటిలోని ఎమోషన్లు తనను ఎలా కనెక్ట్ అయ్యేలా చేస్తాయో స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.కొద్ది రోజుల క్రితం నాని–ప్రేమ్ కుమార్ ఇద్దరూ వ్యక్తిగతంగా కలుసుకుని ఒక కొత్త కాన్సెప్ట్‌పై చర్చలు జరిపారు. ఆ కథకు సంబంధించిన బేసిక్ ఐడియా నానికి వెంటనే నచ్చి, ఫార్మల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే, ఈ ప్రాజెక్ట్ త్వరగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. కారణం ఏమిటంటే—ఇద్దరికీ ముందుగా పూర్తి చేయాల్సిన బిజీ కమిట్‌మెంట్లు ఉండటం. నాని వరుసగా రెండు సినిమాలు అంగీకరించగా, ప్రేమ్ కుమార్‌కు విక్రమ్‌తో పాటు మరికొన్ని తమిళ ప్రాజెక్టులు లైన్లోనున్నాయి.
నానితో పని చేయాలని చాలా మంది స్టార్స్, ఘనమైన కమర్షియల్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నప్పటికీ, నాని మాత్రం పక్కా కంటెంట్ ఉన్న కథలు చెప్పే, ఫీల్ గుడ్ సినిమాలకు పేరుగాంచిన దర్శకులకు అవకాశం ఇస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి