ఏంటి కమల్ హాసన్ కి 70 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? ఇదేం ట్విస్ట్ అనుకుంటారు ఆయన మాటలు వింటే.. మరి ఇంతకీ కమల్ హాసన్ కి వచ్చిన ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. విశ్వ నటుడు కమల్ హాసన్ రీసెంట్ గా కేరళ లో జరిగిన హోర్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. చిన్న తనంలో నా తల్లిదండ్రులు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని చూసేవారు. కనీసం పదవ తరగతి పాస్ అయి ఉంటే రైల్వే జాబ్ వచ్చేదని నా తల్లి ఎప్పుడు అనేది. కానీ ఫైనల్ గా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నా తల్లి కలలు కన్న ఉద్యోగం ఇది.నాకెంతో హ్యాపీ గా ఉంది..

 రీసెంట్ గా నేను సభ కు వెళ్లి సిగ్నేచర్ చేశాను. వారు నా రోజు వారి ఖర్చులకు డబ్బులు ఇచ్చారు. ఈ విషయాన్ని నేను నా తల్లి కి లేకపోతే మరెవరికైనా ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఫైనల్ గా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పాలనుకున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది. ప్రజా సేవ చేయాలని ఎన్నో రోజుల నుండి కలలు కన్నాను. ఫైనల్ గా నేను అనుకున్న కల నెరవేరింది..అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

అయితే కమల్ హాసన్ 70 ఏళ్ల వయసు లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్పడానికి కారణం రీసెంట్ గానే కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా అయినా సంగతి మనకు తెలిసిందే. అలా రాజ్యసభ ఎంపీ అయిన సందర్భంగా 70 ఏళ్ల వయసు లో తనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని తన తల్లి కలలు కన్న ఉద్యోగం ఇది అని గొప్పగా చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: