ఏంటి తేజ సజ్జా ఆ హీరోయిన్ మీద కోపంతో అలాంటి పని చేయించారా.. ఇంతకీ నిర్మాత బయట పెట్టిన నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా ఓ నిర్మాత తేజ గురించి బయటపెట్టిన ఒక విషయం అందర్నీ షాకింగ్ కి గురిచేస్తుంది.నిర్మాత చంద్రశేఖర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఓ హీరో రెండు సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో ఒకటి కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైంది. అయితే ఆ సినిమా విడుదల చేసే సమయంలో రన్ టైం రెండు గంటల 21 నిమిషాలుగా ఫిక్స్ చేసాము. కానీ ఆ తర్వాత అది కేవలం రెండు గంటల నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడంతో నేను షాక్ అయిపోయాను. 

ఏం జరిగిందా అని ఆరా తీస్తే..హీరో, డైరెక్టర్ ఇద్దరు కలిసి హీరోయిన్ కు సంబంధించిన దాదాపు 16 నిమిషాల సన్నివేశాలను కట్ చేయించారట. దానికి కారణం హీరోయిన్ డామినేషన్ తనపై ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతోనే హీరో ఎడిటర్ తో కలిసి హీరోయిన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తీసేయించారట. అయితే ఇది తన కూతురికి సంబంధించిన సినిమా కావడంతో జీవిత రాజశేఖర్ ఇద్దరు కూడా సైలెంట్ గా ఉండలేకపోయారు. వెంటనే ఈ ఇష్యూ ని ఫిలిం చాంబర్ వరకు తీసుకెళ్లారు. ఈ విషయంలో హీరో ఎడిటర్ కలిసి తప్పు చేశారు.

 కానీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు అంటూ సుడిగాలి సుదీర్ నటించిన గోట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత చంద్రశేఖర్ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇది తేజసజ్జా నటించిన అద్భుతం సినిమా అని తెలుస్తోంది. తేజ సజ్జా శివాని రాజశేఖర్ కలిసి సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన సన్నివేశాలను ఎడిటర్ తో కలిసి తేజ లేపేసారట.ఇందులో తన ప్రమేయం లేదని నిర్మాత చంద్రశేఖర్ తాజా ప్రెస్మీట్లో బయటపెట్టారు.అయితే ఈ విషయం బయటపడటంతో చాలా మంది నెటిజెన్లు తేజ సజ్జా ఇలాంటి పనులు కూడా చేస్తాడా.. హీరోయిన్ డామినేషన్ ఉంది అని ఇంత పెద్ద తప్పు చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: