నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా రూపొందిన అఖండ 2 మూవీ ని రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ రోజు రాత్రి నుండి కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించనున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్ షో లకు సంబంధించిన టికెట్ బుకింగ్లు కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. లిమిటెడ్ గా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినా కూడా ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ బుకింగ్లకి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. దానితో ఈ మూవీ కి కేవలం ప్రిమియర్ షో టికెట్ బుకింగ్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే రెండు కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఓపెన్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరల పెంపుకు ఇప్పటివరకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఈ సినిమా యొక్క టికెట్ ధరల పెంపు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా ..? లేదా ..? అనేది చూడాలి. ఈ సినిమా విడుదల సమయం అత్యంత దగ్గర పడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మూవీ టికెట్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. దానితో ఈ మూవీపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: