నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 23.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సీడెడ్ లో 22 కోట్లు , ఉత్తరాంధ్ర లో 11.50 కోట్లు , ఈస్ట్ లో 7.50 కోట్లు , వెస్ట్ లో 5.50 కోట్లు , గుంటూరు లో 8.50 కోట్లు , కృష్ణ లో 5.75 కోట్లు , నెల్లూరు లో 4 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమాకు 88.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా, డబ్బింగ్ వర్షన్ లతో కలుపుకొని ఈ మూవీ కి 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్సీస్ లో 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 114.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 116 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతుంది. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలు హిందీ భాషలో భారీ కలెక్షన్లను వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అలాగే మన తెలుగు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లను వసూలు చేస్తున్నాయి. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా దేశ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , డబ్బింగ్ వర్షన్లకి కలుపుకొని కేవలం 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. దానితో ఈ సినిమాకు కాస్త మంచి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా అవలీలగా 11 కోట్లకు మించిన షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇండియా వ్యాప్తంగా వసూలు చేస్తుంది అని దానితో అఖండ 2 కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , డబ్బింగ్ వర్షన్ హక్కులను కొనుగోలు చేసిన వారికి భారీ లాభాలు వస్తాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: