సినిమా ఇండస్ట్రీ లో ఓ దర్శకుడు ఒక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు అంటే చాలు అతనికి మంచి గుర్తింపు , అద్భుతమైన క్రేజ్ వస్తూ ఉంటాయి. దానితో ఆ తరువాత వారికి వరుస పెట్టి అద్భుతమైన హీరోలతో , మంచి బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు దక్కుతాయి. ఇకపోతే ఓ దర్శకుడు ఏకంగా ఇద్దరు క్రేజీ హీరోలతో ఓ సినిమాను రూపొందించాడు. ఆ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. దానితో ఆయనకు వరుస పెట్టి అదిరిపోయే రేంజ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది అని చాలా మంది అనుకున్నారు. ఆయన ఇప్పటికే ఓ సినిమాను స్టార్ట్ చేసిన ఆ మూవీ కి సంబంధించిన అప్డేట్లు ఏమీ రావడం లేదు. ఇంతకు మంచి విజయాన్ని అందుకున్నా కూడా తన తదుపరి మూవీ విషయంలో కాస్త తడబడుతున్న ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... సాగర కే చంద్ర. ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ , దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను సాగర్ కే చంద్ర కు మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైసన్ నాయుడు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయ్యి చాలా కాలమే అవుతుంది. మధ్యలో ఈ మూవీ కి సంబంధించిన ఒకటి , రెండు అప్డేట్లు వచ్చిన ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు రావడం లేదు. దానితో చాలా మంది భీమ్లా నాయక్ మూవీ తో ఈయనకు అద్భుతమైన విజయం దక్కిన , రెండవ సినిమాను చాలా స్పీడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విషయంలో ఈ దర్శకుడు కాస్త తలబడుతున్నాడు అనే అభిప్రాయాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: