నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో రైతుగా , మరో పాత్రలో అఘోరాగా నటించి రెండు పాత్రలలో కూడా తనదైన వేరియేషన్స్ ను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బోయపాటి శ్రీను , బాలకృష్ణ హీరో గా సంయుక్త మీనన్ హీరోయిన్గా అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... 14 రూల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు నిన్న ప్రదర్శితం కావలసింది.

అంతా అనుకున్నట్లుగా జరుగుతుంది అనుకునే లోపే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఇక ఈ సినిమా విడుదల ఆగిపోయిన కూడా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ మాత్రం చాలా ప్రాంతాల్లో ఓపెన్ అయ్యాయి. దానితో ఈ సినిమాను చూడాలి అని ఉద్దేశంతో ఎంతో మంది ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్లను చేసుకున్నారు. ఇక తాజాగా బుక్ మై షో ఆప్ వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు 24 గంటల్లో 110.35 కే సేల్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. దీని తోనే అర్థం అవుతుంది 24 గంటల్లో ఈ స్థాయిలో టికెట్స్ సేల్ అయ్యాయి అంటే ఈ మూవీ ని థియేటర్లలో చూడాలి అని జనాలు ఎంత ఆత్రుతగా ఉన్నారు అనేది. అలా జనాలు ఎంతో ఆత్రుతగా ఈ సినిమాలు చూడాలి అని వెయిట్ చేస్తున్నా సమయంలో ఈ సినిమా విడుదల వాయిదా అనేది బాలయ్య అభిమానులను తీవ్ర నిరుత్సాహపరుస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: