ఏంటి బాలకృష్ణ ఈ మాటలు నిజంగానే అన్నారా.. నిర్మాతలపై అంత కోపంగా ఉన్నారా ? కనిపిస్తే తంతా అని వార్నింగ్ ఇస్తున్నారా.. ఇంతకీ ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురుచూసిన అఖండ-2  సినిమా వాయిదా పడింది. ఈ సినిమా వాయిదా పడడంతో నిర్మాతలపై అభిమానులు చాలా కోపంగా ఉన్నారు. అంతేకాదు చాలామంది అభిమానులు బయట నిర్మాతలు కనిపిస్తే పట్టుకొని కొట్టాలి అనే రేంజ్ లో కోపంగా ఉన్నారు.అయితే బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు బాలకృష్ణ కూడా ఈ విషయంలో నిర్మాతలపై చాలా కోపంగా ఉన్నారట. 

వేరే సంస్థ తో ఆర్థిక లావాదేవీల ఇష్యూ ఉన్నప్పటికీ ఈ విషయం బయట పెట్టకుండా సినిమాని పూర్తి చేసి ఏమీ తెలియనట్టు చివరికి విడుదలయ్యే సమయానికి నిజంగానే ఆ సంస్థకు మేము డబ్బులు ఇచ్చేది ఉంది అని ప్రొడ్యూసర్లు చెప్పడంతో బాలకృష్ణ వారిపై చాలా కోపగించుకున్నారట. ముఖ్యంగా తనకి కనిపిస్తే బాగుండదని, ఇంటికి వస్తే తంతా అని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ మామూలుగానే చాలా కోపంగా ఉంటారు. అలాంటిది తన పాన్ ఇండియా మూవీ విడుదల కాకుండా పోస్ట్ పోన్ చేశారంటే ఇంకెంత కోపంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

అంతే కాదు ఈ విషయంలో బాలకృష్ణ ఆగ్రహం కట్టలు తెంచుకుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఫైనాన్స్ విషయం తన దగ్గర దాచిపెట్టి చివరి నిమిషంలో చెప్పడంతో బాలకృష్ణ నిర్మాతలపై ఫైర్ అవ్వడంతో పాటు చివాట్లు పెట్టారట. ఇంకొకసారి నాకు కనిపించకండి అంటూ తిట్టి పంపించారట. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఇక ఆర్థిక లావాదేవుల విషయంలో ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఇద్దరు తమ రెమ్యూనరేషన్ లో కొంత భాగం తిరిగి ఇస్తున్నట్టు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: