స్టోరీ:
ఇండియా పై పాకిస్తాన్ జరిపిన కొన్ని ఉగ్ర దాడులలో 2001లో జరిగినటువంటి పార్లమెంట్ అటాక్ కూడా ఒకటి. ఈ దాడులను సైతం ఇంటిలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్వల్(మాధవన్) పాకిస్తాన్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయాలని ఒక బోల్డ్ ప్లాన్ వేస్తారు.. అయితే ఈ ప్రమాదకరమైన ఆపరేషన్ కోసం హామ్జా అలీ మజారీ (రణబీర్ సింగ్) లా ఉండే వ్యక్తిని ఎంచుకుంటారు. అక్కడి నుంచి ఆ మిషన్ ఎలా కొనసాగుతుంది? ఆలీ తనకిచ్చిన పనిని పూర్తి చేశారా లేదా? ఉగ్రవాదుల ప్రపంచానికి ఎలాంటి సమాధానం చెప్పారు అనేది ఈ సినిమా కథ.
సినిమాకి ప్లస్:
ఇప్పటివరకు బాలీవుడ్ లో విడుదలైన ఎన్నో స్పై యాక్షన్ చిత్రాలన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఫీల్ మూవీస్.. కానీ వాటన్నిటికీ భిన్నంగానే ధురంధర్ సినిమా ఉంది. సినిమాలో చాలా లోతైన స్పై , థ్రిల్లర్ మూమెంట్స్ ఉన్నాయి .
నిజజీవితంలో కూడా స్పై ఏజెన్సీలు ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటారా? అనేది చూపించారు. సినిమా రా అండ్ రస్టిక్ గా డైరెక్టర్ ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించారు. పాకిస్తాన్ అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ ఎంత క్రూరంగా ఉంటారో చాలా కళ్ళకు కట్టినట్లు చూపించారు.
ట్రైలర్లో చూపించిన దానికంటే అంతకుమించి సినిమాలో చూపించారు ఆదిత్య ధర్.3:34 నిమిషాలు నిడివి కలిగిన సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా చూపించారు.
అలాగే నటీనటుల ఎంపిక కూడా వారికి ఇచ్చిన పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా తమ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతిసారి కూడా ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉంటాయి.
అలాగే నటుడు మాధవన్ కూడా పూర్తిగా సరికొత్త లుక్కులో కనిపించారు. అలాగే అర్జున్ రాంపాల్, సారా అర్జున్, సంజయ్ త్ వంటి స్టార్ నటులు కూడా తమ యాక్టింగ్ తో అదరగొట్టేశారు.
మైనస్:
ఒక సెక్షన్ ఆఫ్ రెగ్యులర్ ఆడియన్స్, రన్ టైమ్ ఎక్కువగా ఉందని ఆలోచించేవారికి ఆకట్టుకోకపోవచ్చు.
సెకండ్ హాఫ్ లో వచ్చే పెళ్లి సాంగ్
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోకపోవచ్చు.
సాంకేతికవర్గం:
సినిమా విజువల్స్ పరంగా కెమెరా వర్క్ అదిరిపోయింది. నిర్మాణ విలువలు కూడా సూపర్ గా ఉన్నాయి. సినిమాకి మ్యూజిక్ ప్లస్ గా మారింది. శివకుమార్ ఎడిటింగ్ పనితీరు అద్భుతంగా ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ పక్క ప్లాన్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది.
రేటింగ్:
2.9/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి