తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని , సూపర్ సాలిడ్ గుర్తింపును దక్కించుకున్న అతి కొద్ది మంది బ్యూ టీలలో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకి వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కాయి. 

అందులో భాగంగా ఈమె ఉప్పెన తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూవీలతో ఈమెకు రేసు తెలుగులో మరింత పెరిగింది. ఆ తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఈమెకు బంగార్రాజు సినిమా తర్వాత మంచి విజయాలు దక్కలేదు. ఇకపోతే ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును దక్కించుకున్న ప్రస్తుతం మాత్రం విజయాలు లేకపోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దానితో ఈమె కూడా తెలుగు సినిమాల కంటే కూడా ఇతర భాష సినిమాలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈమె మలయాళం లో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం వరుస పెట్టి తమిళ సినిమాలలో నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకొని మలయాళ , తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ రావడంతో ఈమె నెక్స్ట్ టార్గెట్ హిందీ అని  , హిందీ సినిమాల్లో గనుక ఈమె అవకాశాలను దక్కించుకుంటే ఈమెకు ఇండియా వ్యాప్తంగా అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా కృతి శెట్టి ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks