టాలీవుడ్ హీరోయిన్ సమంత, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు డిసెంబర్ ఒకటవ తేదీన కోయంబత్తూరులో ఈషా యోగా కేంద్రం సమీపంలో ఉన్న 7 అడుగుల లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో రెండో వివాహం చేసుకొని అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి పెళ్లి వేడుక కేవలం అత్యంత సన్నిహితులు, బంధువులు, ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి పైన రాజ్ చిన్నమ్మ, సమంత అత్త, ప్రముఖ సింగర్ గా పేరు సంపాదించిన శోభారాజు స్పందించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభారాజు మాట్లాడుతూ.." సమంత కోడలిగా రావడం మా కుటుంబానికి ఎంతో అదృష్టం. సమంత చాలా మంచి  అమ్మాయి, పద్ధతిగా ఉంటుంది.పెళ్లి చీరలో చాలా చూడముచ్చటగా ఉందంటూ" తెలియజేసింది. ఆమె రాజ్ జీవితంలోకి రావడం మాకు మరింత ఆనందంగా ఉందని తెలియజేసింది. అలాగే రాజ్ కు పాటలు పాడడం చాలా ఇష్టం. భక్తి కూడా ఎక్కువ అంటూ  తెలియజేసింది. సమంత కి కూడా ఆధ్యాత్మిక మార్గంపై చాలా ఆసక్తి ఉంది అంటూ తెలిపింది శోభారాజు.


ఆమె ఇంకా మాట్లాడుతూ.. యోగా సెంటర్ లో సమంతను రెండుసార్లు కలిశాను.. ఆమె  చూడడానికి చాలా సన్నగా ఉంది.. దీంతో సన్నగా అవ్వాలంటే ఎలా? అని ఆమెను డైట్ టిప్స్ అడగగా.. కొన్ని వర్కౌట్స్ చెప్పింది. కానీ వాటిని చేయడం నావల్ల కాదని వదిలేసానని తెలిపాను అంటూ శోభ రాజు తెలిపింది. కానీ ఈషా ఆశ్రమంలో మౌనం పాటిస్తూ సాధన చేయడం ఆనందంగా ఉంటుందని తెలిపింది..రాజ్ ఎక్కువగా తన తల్లి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువగా పెరిగారని,  అందుకే చిన్న వయసు నుంచే ఎక్కువగా సంగీతం నేర్చుకున్నారని తెలిపింది. శోభారాజు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శోభారాజు 2010లో పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది.. శోభారాజు అక్క రమాదేవి కుమారుడే రాజ్ నిడిమోరు.

మరింత సమాచారం తెలుసుకోండి: