తెలుగు సినిమా ప్రస్తుతం ఉన్న తరంలో, రాజులు, చక్రవర్తులు, లేదా పౌరాణిక రాజవంశాలు అనే నేపథ్యాల్లో సినిమాలు తీసుకోవాలని అనుకుంటే, అందరికీ మొట్టమొదట గుర్తుకు వచ్చేది ప్రభాస్ అనే పేరే. ముఖ్యంగా ‘బాహుబలి’ వంటి మేటి చిత్రంతో ఆయనకు వచ్చిన స్థానం వేరే దేనితో పోల్చలేనిది. భారత సినిమా చరిత్రలో ఒక నిజమైన రాజు స్క్రీన్‌పై కనిపించాడంటే, అది ప్రభాస్ ద్వారానే అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా ఏర్పడింది.ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి ఎంత పెద్ద మైలురాయో అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాజెక్టు ఎలా రూపుదాల్చింది..? అది ఎందుకు ఇంత గొప్ప సినిమా అయింది..? అన్నదానికి సమాధానం ఇటీవల జపాన్‌లో జరిగిన మీట్‌లో స్వయంగా ప్రభాస్ చెప్పిన విషయం మరింత ఆసక్తికరంగా మారింది.


ఆ మీట్‌లో ప్రభాస్ చెప్పిన ప్రకారం, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పటికే ప్రభాస్‌ని రాజులుగానే చూపించే విధంగా మొత్తం ఐదు కథలను సిద్ధం చేసి ఉంచాడట. అంటే ప్రారంభం నుంచి ప్రభాస్ లుక్, చరిష్మా, వ్యక్తిత్వం అన్నీ ఒక రాజు పాత్రకు ఎంత సూట్ అవుతాయో ఆయన అప్పుడే గుర్తించాడనేది అర్థం.అతి ముఖ్యంగా — ఆ ఐదు కథలలో చివరకు ఒక కథే బాహుబలిగా ఫైనల్ అయ్యిందట. అలా రాజమౌళి ఎన్నుకున్న మాస్టర్ ప్లాన్ భారత సినిమా చరిత్రను మార్చేసిన విధంగా, ప్రపంచ సినీ రంగంలో కూడా భారత సినిమాకి ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.


ఇంత పెద్ద విజన్ తో ముందుకెళ్లిన దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. ఒక హీరోని రాజు పాత్రకు సిద్ధం చేయడం, రాజవంశం ఉన్నట్టుగా స్క్రీన్ మీద కనిపించేలా చూపించడం, అంతేకాకుండా ప్రేక్షకులు కూడా నిజంగానే అతడిని రాజుగా భావించేలా చేయడం…. ఇవన్నీ ఒకే దర్శకుడు గ్యారెంటీగా చేయగలడంటే అదీ జక్కన్నే.ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పడం, అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే భారత సినిమా దగ్గర ప్రభాస్‌కి రాజు అనే ఇమేజ్ బాహుబలి ద్వారా మాత్రమే రాలేదు… ఆయన వ్యక్తిత్వానికీ అలాంటి స్థానం ఉందని ప్రపంచం ముందే మరోసారి నిరూపణ అయ్యింది.



ఈ 5 కథల్లో మిగతా కథలు ఏవి, ఎలాంటి కాన్సెప్ట్ ఉన్నవి, అవి నిజంగా ఎప్పుడైనా సినిమా రూపం దాల్చుతాయా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రతి సినీ అభిమాని మనసులో తచ్చాడుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఈ కాన్సెప్ట్‌లలో ఇంకొకటి సినీ రూపం దాల్చితే, మళ్లీ ప్రభాస్‌ని రాజుగానే చూసే అవకాశం రావచ్చు.మొత్తానికి — రాజమౌళి మాస్టర్ ప్లాన్, ప్రభాస్ వ్యక్తిత్వం, ప్రేక్షకుల ప్రేమ— ఇవన్నీ కలిసి బాహుబలిని సృష్టించాయి. కేవలం ఒక సినిమా కాదు… అది భారత సినిమా దగ్గర చిరస్థాయిగా నిలిచిపోయిన సంచలన విజయం!

మరింత సమాచారం తెలుసుకోండి: