బాలీవుడ్ లో క్యూట్ జంటగా పేరు సంపాదించిన జంటలలో రణబీర్, అలియా జంట కూడా ఒకరు. ఇద్దరు కూడా బాలీవుడ్ లో స్టార్స్ గా పేరు సంపాదించారు. ఒకవైపు బిజినెస్ లో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా ఈ జంట ముంబైలో ఒక అదిరిపోయి ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ప్రాంతంలో ఉండే సిని ప్రముఖుల ఇళ్లల్లో కెల్లా ఇదే అత్యధిక ఖరీదైన ఇల్లని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట ఉండే పాత కృష్ణరాజ్ బంగ్లా ప్లేసులో ఈ కొత్త ఇల్లు కట్టుకున్నట్లు సమాచారం.

ఈ 6 అంతస్తుల బిల్డింగ్ చూడడానికి చాలా సాంప్రదాయంగా కనిపిస్తోంది. అలాగే లోపల మాత్రం అధునాతన ఫీచర్స్ తో కలిగి ఉన్న సదుపాయాలు ఉన్నాయట. అలాగే చిన్నపాటి భూకంపం వచ్చినా కూడా తట్టుకునే విధంగా ఈ ఇల్లు నిర్మించారు. ఈ ఇల్లు కోసం నిర్మించిన అద్దాలు, ఫర్నిచర్ అన్నీ కూడా ఇటలీ నుంచి తెప్పించారు.కిచెన్ సామాగ్రి మొత్తం నెదర్లాండ్ నుంచి తెప్పించినట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ విలాసవంతమైన ఇల్లు తగ్గట్టుగానే సుమారుగా 15 కార్లు పార్కింగ్ చేసుకుని సదుపాయంతో ఏర్పాటు చేసుకున్నారు.


ఇంటి విలువ సుమార్గం రూ .350 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ఇంటి గదులలో కూడా ఎవరెవరు ఎక్కడ ఉండాలనే విషయాన్ని కేటాయించుకొని మరి ఇల్లు నిర్మించుకున్నారు. ఆలియా, రణబీర్ కూతురు కోసం ప్రత్యేకించి ఒక రూముని ఏర్పాటు చేశారు. అలాగే ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్, టెర్రస్ గార్డెన్ లో ప్రత్యేకించి విదేశాల నుంచి మొక్కలు తెప్పించారు. అలాగే బిల్డింగ్ లోపలికి ఎంట్రీ లోనే హాల్లో పెట్టిన వినాయకుడు విగ్రహం హైలెట్ గా ఉంటుంది. అయోధ్యలో ఉండే బాల రాముడు విగ్రహాన్ని చెక్కిన వ్యక్తి చేత ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించారట. మొత్తానికి ఈ బాలీవుడ్ కపుల్స్ తట్టుకున్న ఇంటి వల్ల మరొకసారి వార్తలలో నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: