ఇతర నటీనటులతో పెండింగ్ షూటింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటినుంచి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యింది చిత్ర బృందం. ఇందులో భాగంగా లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6:30 నిమిషాలకు సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ అభిమానులను అలరించే విధంగా డాన్స్ ఉంటుందని ఆశిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.
అలా ఈ సినిమాకి సంబంధించి పలు అప్డేట్లను విడుదల చేస్తూ వచ్చే యేడాది మార్చి నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటివరకు ఏదో విధంగా సినిమాకి సంబంధించి అప్డేట్లను విడుదల చేస్తూ రిలీజ్ సమయానికి హైప్ తీసుకువచ్చేలా చూస్తోంది చిత్ర బృందం. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ఇందుకు సంబంధించి పోస్టర్లు కూడా చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. మరి వచ్చే ఏడాది మార్చిలో విడుదలవుతుందా? లేదా అనే విషయం చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి