అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు ఆ కామెంట్లకు సంబంధించిన వారు ఇచ్చే రిప్లైలు వెరైటీగా ఉంటాయి.అలా తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి ఇచ్చిన రిప్లై అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.మరి ఇంతకీ నెటిజన్ అడిగిన ప్రశ్న ఏంటి.. రాహుల్ రవీంద్రన్  ఇచ్చిన సమాధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తో భారీ హిట్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. రష్మిక మందన్నా మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి రష్మిక బాయ్ ఫ్రెండ్ గా కనిపించారు. ఆడవాళ్లు ఇబ్బందులు పడి ఆ ఇబ్బందుల నుండి బయటపడి ఆదిశక్తిలా ఎలా మారుతారు అనేది సినిమాలో చూపించారు. 

అయితే ఈ సినిమా చివర్లో రష్మిక మందన్నా ఫేస్, డ్రెస్ మొత్తానికి పలు రంగులు పూసి ఉంటాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ రష్మిక మందన్నా మొహంపై అన్ని రంగులు ఎందుకు పూశారు. అర్జున్ రెడ్డి సినిమాకి ఈ సినిమాకి ఏదైనా లింకు ఉందా అనే విధంగా ఓ ప్రశ్న సంధించారు. అయితే ఈ ప్రశ్నకి నెటిజన్ కి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఆయన తన ట్వీట్లో ఏమన్నారంటే..ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి ఏ సినిమాతో కూడా ఎలాంటి సంబంధం లేదు మిత్రమా.. ఈ రంగులు పూయడానికి కారణం ఆమెని ఆ రంగులు సిగ్గు పడేలా.. అవమానపడేలా విక్రమ్ ఉపయోగించారు. అయినా వాటిని స్వీకరించడం నేర్చుకుంది. 

ఆ టైంలో అది ఆమెలో భాగమని తెలుసు. అయినా కూడా ఆ అంగీకారమే తనని మరింత బలంగా చేసింది. ఒకప్పుడు ఎంతో ఇంట్రోవర్ట్ గా ఉన్న అమ్మాయి ఇప్పుడు కాలేజీ అందరి ముందు ఆ రంగులతో నిలబడడానికి భయపడలేదు. అయితే ఈ విషయాన్ని చెప్పడం కోసమే విక్రమ్ ఆమెపై అన్ని రంగులు ఉపయోగించారు. ఇక ఈ విషయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే "మరి నీకు లేని సిగ్గు నాకెందుకురా ఎదవా" అని చెప్పడమే అంటూ రాహుల్ రవీంద్రన్ నెటిజన్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: