- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన అఖండ 2 - తాండ‌వం సినిమా ఈ నెల 5న రిలీజ్ కావాల్సి ఉంది. 4వ తేదీన పెద్ద ఎత్తున ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రీమియ‌ర్లు కూడా ప్లాన్‌చేశారు. ఇక ప్రీమియ‌ర్ టిక్కెట్లు కూడా వ‌చ్చేశాయి. థియేట‌ర్ల ద‌గ్గ‌ర నంద‌మూరి ... బాల‌య్య అభిమానులు క‌టౌట్లు పెట్టి హంగామాకు రెడీ అయిపోయారు. ఓ వైపు సినిమా కూడా లోడింగ్ అయిపోయింది. ఈ టైంలో ఏరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ తో ఈ సినిమా మేక‌ర్స్ అయిన 14 ఫ్ల‌స్ రీల్స్ వారికి ఉన్న ఆర్థిక వివాదాల నేప‌థ్యంలో మ‌ద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వ‌డంతో అఖండ 2 తాండ‌వం సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఓ వైపు మేక‌ర్స్ రు. 28 కోట్ల ఫైనాన్షియ‌ల్ ఇష్యూను క్లీయ‌ర్ చేసేందుకు గ‌త నాలుగు రోజులుగా అనేక మీటింగ్‌లు పెట్టి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. ఎట్ట‌కేల‌కు అఖండ 2 వివాదానికి చెక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది.


గ‌త రాత్రి సైతం 14 ఫ్ల‌స్ రీల్స్ కు , ఈరోస్ ప్ర‌తినిధుల‌కు మ‌ధ్య సానుకూల చ‌ర్చ‌లు జ‌రిగాయని టాలీవుడ్ ఇన్న‌ర్ సర్కిల్స్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ఈ రోజు మ‌ద్రాస్ హై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఇందులో ఇదే విష‌యాన్ని చెప్పి సినిమా రిలీజ్‌కు అనుమ‌తులు తీసుకోవాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను డిసెంబ‌ర్ 12న రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నారు. 11న రాత్రి సెకండ్ షో నుంచి ప్రీమియ‌ర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: