వైద్య పరీక్షల తర్వాత కేసు కొట్టి వేయాలంటూ నటి హేమ హైకోర్టుని ఆశ్రయించగా ,హేమ ఫిటిషన్ హైకోర్టు స్వీకరించి నిందితులపైన NDPS కేసును కొనసాగించడానికి ఎటువంటి చట్టపరమైన ఆధారాలు లేవని నిర్ధారించింది. ఇప్పుడు తాజాగా ఈ విషయం పైన కేసు కొట్టి వేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ (డిసెంబర్ 9) తీర్పు ఇచ్చింది. ఈ కేసు కొట్టి వేసిన తర్వాత నటి హేమ ఎమోషనల్ గా మాట్లాడుతూ ఈ కేసు వల్లే తన తల్లి చాలా మానసికంగా కృంగిపోయి మరణించిందని తెలియజేస్తూ అందరి ముందే కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హేమకి ఈ కేసు కొట్టి వేయడంతో భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.
తెలుగులో వందలాది చిత్రాలలో సహాయ నటిగా నటించిన హేమ. హీరో హీరోయిన్స్ కి తల్లిగా, పిన్నిగా, అక్కగా నటించి భారీగానే పేరు సంపాదించింది. గతంలో కూడా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొనింది. అలా పలు రకాల టీవీ షోలలో సందడి చేయడమే కాకుండా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చాలా కీలకమైన బాధ్యతలను కూడా నిర్వహించింది. అయితే తన మీద వచ్చిన డ్రగ్స్ కేసు ఆరోపణలవల్ల సినిమా అవకాశాలు తగ్గాయి.. అయితే తిరిగి మళ్లీ తాను సినిమాలలో ఇక ధైర్యంగా నటిస్తానంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది హేమ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి