ఏంటి భరణి శంకర్ కోసం రంగంలోకి మెగా డాటర్ దిగిందా.. నాగార్జునతో సంప్రదింపులు కూడా చేస్తోందా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో ఇమ్మానుయేల్, తనూజ, పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి,సంజనలు మాత్రమే ఉన్నారు. ఇందులో ఈసారి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు అనే టాక్ వినిపిస్తుంది.ఈ నేపథ్యంలోనే టాప్ 5 లో ఎవరు ఉంటారు అనే చర్చ కూడా నడుస్తోంది.అయితే చాలామంది టాప్ 5 లో తనుజ,కళ్యాణ్ పడాల, ఇమ్మానుయేల్, డిమాన్ పవన్, సంజన ఉంటారని అంటున్నారు.

కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 లో భరణి ఉంటారని ప్రచారం జరుగుతుంది.అదేంటంటే తాజాగా నాగార్జున, నిహారిక కలిసి ఓ దగ్గర కలిసినప్పుడు మాట్లాడుకున్న వీడియో ఒకటి చెక్కర్లు కొడుతుంది.అందులో నిహారిక బిగ్ బాస్ హౌస్ గురించి ప్రస్తావిస్తూ భరణి శంకర్ గురించి మాట్లాడగా.. మీ నాన్న భరణికి గురువు అంట కదా అని నాగార్జున మాట్లాడతారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చెక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజెన్లు మెగా డాటర్ నిహారిక భరణి శంకర్ కోసం రంగంలోకి దిగిందని, భరణి శంకర్ మెగా ఫ్యామిలీ వల్ల టాప్ 5 లో ఉంటారని, ఈ విషయం గురించి నిహారిక నాగార్జునతో సంప్రదింపులు చేస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. 

మరి నిజంగానే మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో భరణి టాప్ 5 లోకి వెళ్తారా.. లేక ఆడియన్స్ ఓట్ల ప్రకారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వస్తారా అనేది తెలియాలి. నిజానికి చెప్పుకోవాలంటే భరణి కంటే సుమన్ శెట్టి,సంజనలకే బయట మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే భరణిని ఇప్పటికే ఓసారి ఆడియన్స్ ఎలిమినేట్ చేశారు. కానీ మళ్ళీ ఆయన్ని మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హౌస్ లోకి తీసుకురావడం కోసం శ్రీజ దమ్ము ని బలి చేసి ఆయన్ని హౌస్ లోకి తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: