సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే ఎవరికైనా వరుస పెట్టి ప్లాప్స్ దక్కినట్లయితే వారిని ఐరన్ లెగ్ డ్యూటీ అని అంటూ ఉండడం సర్వసాధారణమైన విషయం. కెరియర్ ప్రారంభం లో వరుస అపజయాలను అందుకొని ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఓ బ్యూటీ ఆ తర్వాత వరుస పెట్టి ప్లాప్స్ ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇంతకు కెరియర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకొని ఆ తర్వాత స్టార్ బ్యూటీ గా ఎదిగిన నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి శృతి హాసన్. ఈమె తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. ఈమె ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఇకపోతే ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. 

దానితో ఈమెకు ఐరన్ లెగ్ బ్యూటీ అనే పేరు వచ్చింది. ఇక ఈమెకు మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ద్వారా బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఈ సినిమా ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమెకి వరుస పెట్టి తెలుగు , తమిళ్ సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఈమె అనేక విజయాలను అందుకుని ఎన్నో సంవత్సరాలు పాటు టాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ఈమె ఇప్పటికే ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇలా కెరియర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ బ్యూటీ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: