నందమూరి బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 4 న ప్రదర్శించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ను కూడా చాలా ప్రాంతాలలో ఓపెన్ చేశారు. అంతా ఒకే అయ్యింది. ఈ సినిమా విడుదల అవుతుంది అనుకునే లోపే ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తాజాగా అఖండ 2 మూవీ యూనిట్ వారు ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను డిసెంబర్ 11 వ తేదీన ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక అఖండ 2 సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఆ మూవీ కి వారం గ్యాప్ ఇచ్చి అనేక చిన్న సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

సడన్గా అఖండ 2 సినిమా డిసెంబర్ 5 వ తేదీన కాకుండా 12 వ తేదీన విడుదల కానుండడం తో అనేక చిన్న సినిమాలు అఖండ 2 మూవీ తో పోటీ పడాల్సిన సిట్యువేషన్ వచ్చింది. అఖండ 2 మూవీ విడుదల అయిన తర్వాత ఆ సినిమాకు అత్యంత దగ్గర రోజుల్లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ మూవీ లు ఏవి అనేది తెలుసుకుందాం. అఖండ మూవీ విడుదల రోజే తమిళ నటుడు కార్తీ హీరోగా రూపొందిన అన్నగారు వస్తారు సినిమాను విడుదల చేయనున్నారు. ఇక డిసెంబర్ 13 వ తేదీన మోగ్లీ మూవీ విడుదల కానుంది. డిసెంబర్ 18 వ తేదీన అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ విడుదల కానుంది. ఇలా అఖండ సినిమా డిసెంబర్ 5 వ తేదీన కాకుండా డిసెంబర్ 12 వ తేదీన విడుదల కానుండడంతో అఖండ 2 సినిమా చాలా సినిమాలతో పోటీ ఎదురుకోవాల్సిన అవసరం వస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: