ఒకప్పుడు తెలుగు సినిమాలలో ఎంతోమంది కమెడియన్స్ కడుపుబ్బ నవ్వించేవారు. అలాంటి సినిమాలకు పెట్టింది పేరు జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు పేరు వినిపించేది. ఎంతోమంది కమెడియన్స్ సైతం వీరే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ ఇప్పుడు ఆ తరహా డైరెక్షన్లో సినిమాలు తీసేవారు కనిపించలేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో నవ్వు సరిగ్గా వినిపించట్లేదని చెప్పవచ్చు. మరి అందుకు గల కారణమేంటో చూద్దాం?.


ఒకానొక సమయంలో తెలుగు సిని పరిశ్రమ కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. ఎన్నో వైవిద్యమైన సినిమాలలో కమెడియన్సు  అలరించేవారు. గడచిన పదేళ్ల ముందు హీరోలు కూడా కామెడీ చేయడం మొదలుపెట్టి 10 ఏళ్ల వరకు ఈ ట్రెండ్ నడిచింది. గత కొన్నేళ్ల నుంచి మాత్రం తెలుగులో కామెడీ సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల వల్ల కామెడీ అనేది సరిగ్గా కనిపించట్లేదని సినీ నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా మోజులో పడ్డారని చాలా క్లియర్ గా కనిపిస్తోంది.


ఇక కొత్తగా వస్తున్న దర్శకులు కూడా తక్కువ బడ్జెట్లో కామెడీ సినిమాలు చేయాలని అసలు ఆలోచించలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ యాక్షన్ లవ్ స్టోరీలను  తెరకెక్కిస్తున్నప్పటికీ పదిలో ఒకటో రెండో చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్నాయి. కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో హిట్ అనిపించుకుంటున్నాయి. గడచిన 20 సంవత్సరాల క్రితం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు గోల్డెన్ డేస్ అని చెప్పవచ్చు. అంతకుముందు ఉండే దర్శక నిర్మాతలు ఇంటిల్లిపాది చూసే కథలను సినిమాలుగా తీసేవారు. ఈ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కు క్యూ కట్టేలా చేసేవి. దీనివల్ల కలెక్షన్స్ కూడా బాగా పెరిగేవి.


అయితే ఈమధ్య యూత్ కోసం బోల్డ్ కాన్సెప్ట్ ,యాక్షన్ సినిమాలు, పీరియాడికల్ మూవీలతో హడావిడి చేస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ .300 కోట్ల రూపాయలు సాధించింది. దీన్ని బట్టి చూస్తే తెలుగు ప్రేక్షకులు కామెడీ సినిమాల కోసం ఎంతలా ఆరాటపడుతున్నారో చెప్పవచ్చు. అలాగే మ్యాడ్ స్క్వేర్ , కె ర్యాంప్, లిటిల్ హార్ట్స్, ద గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో వంటి చిన్న సినిమాలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి. అయితే ఇవన్నీ కూడా స్టార్ హీరోలు ఎవరూ లేరు కాబట్టి అంతంత మాత్రం గానే గుర్తింపు సంపాదించాయి. ఈ చిత్రాలు స్టార్ హీరోలతో చేసి ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది. పైరసీ వల్ల మా సినిమా కలెక్షన్స్ కి దెబ్బ పడుతోందని చెబుతున్నారు తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే కామెడీ చిత్రాలు చేయాలనే ఆలోచనని మర్చిపోతున్నారు దర్శక నిర్మాతలు. అందుకే ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ కామెడీ ని మిస్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: