బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో అఖండ 2 సినిమా డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కావాల్సి ఉండగా,ఫైనాన్స్ ఇష్యూ కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడిందని తెలిసిందే. ఇప్పుడు వీటన్నిటినీ అధికమించి డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. డిసెంబర్ 11 రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే భారీగానే వసూలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి కూడా భారీగానే బజ్ ఏర్పడింది.



మొదట విడుదల సమయంలో అనుకున్న హైప్ కంటే ఇప్పుడు మరింత హైప్ పెరిగిపోయింది. ఇటువంటి తరుణంలోని బాలయ్య అభిమానులు టెన్షన్ లో ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.. ఈరోజు రాత్రి 9:30 నిమిషాలకు ప్రీమియర్ షో తో మొదలు కాబోతోంది. మరొకవైపు విడుదలకు కౌండౌన్ స్టార్ట్ అంటు మొదలుపెట్టారు. రెగ్యులర్ షోకి సంబంధించి 12వ తేదీన బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. కానీ ప్రీమియర్స్ బుకింగ్స్ విషయంలో మాత్రం ఇంకా మేకర్స్ ఓపెన్ చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం నుంచి ప్రీమియర్ షో వేసుకునేందుకు అనుమతులు కూడా లభించాయి.


ముఖ్యంగా ప్రీమియర్ షోల రూ.600 రూపాయిలో వరకు నిర్ణయిస్తూ జీవో కూడా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షోకి సంబంధించి డిసెంబర్ 12వ తేదీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ ప్రీమియర్ షోకి మాత్రం ఇంకా ఓపెన్ చేయకపోవడంతో బాలయ్య అభిమానులలో టెన్షన్ మొదలయ్యింది. రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాల నుంచి ప్రీమియర్ షోకి అనుమతులు వచ్చినా కూడా ఇంకా ప్రీమియర్ షో విషయంలో మేకర్స్ ఇంకా తర్జన పర్జన పడుతున్నారని బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు? అసలు ప్రీమియర్ షోలు ఉంటాయా? ఉండవా అనే విషయంపై చిత్ర బృందం ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: