- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో , నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మోస్ట్ మాసీవ్ అవైటెడ్ సినిమా అఖండ 2 - తాండ‌వం. ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ జ‌నాలు అంద‌రూ క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల లోకి వ‌స్తుందా ? అని అంద‌రూ ఆస‌క్తి తో ఉన్న వేళ డిసెంబ‌ర్ 5 రిలీజ్ డేట్ వేశారు. అయితే చివ‌ర్లో అనూహ్య కార‌ణాల‌తో సినిమా వాయిదా ప‌డింది. ఇప్పుడు అన్ని అవాంత‌రాలు దాటుకుని.. ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ క్లీయ‌ర్ చేసుకుని అఖండ 2- తాండ‌వం ఈ నెల 12న వ‌స్తోంది.


ఈ రోజు రాత్రి 8. 30 గంట‌ల నుంచి అఖండ 2 - తాండ‌వం ప్రీమియ‌ర్ షోలు ప్రపంచ వ్యాప్తంగా మొద‌లు కానున్నాయి. ఇక రేప‌టి నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షో లు మొద‌లు కానున్నాయి. ఇక ఈ సినిమా కు యూఎస్ మార్కెట్ లో కూడా ఇలా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయో లేదో అఖండ 2 సెన్షేష‌న్ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికా లో క్రేజీ ఓపెనింగ్స్ సెట్ చేసుకుంది. ఇలా ప్రీమియ‌ర్ షో వ‌సూళ్లు అప్పుడే 3 ల‌క్ష‌ల డాల‌ర్లు క్రాస్ అయ్యాయి. అప్పుడే 3 ల‌క్ష‌ల డాల‌ర్లు క్రాస్ అయ్యి .. ఇంకా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇలా క్రేజీ వసూళ్లు అఖండ 2 అందుకోబోతుండగా డే 1 కి అంతకు మించిన మార్జిన్ దాటినా ఎలాంటి ఆశ్చర్యం లేదని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో అలాగే 3డి లో కూడా విడుదల చేస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: