టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ చరణ్ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా గేమ్ చెంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు , సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. శివ రాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాందు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మూవీ నుండి కొన్ని రోజుల క్రితం చిక్రీ చిక్రీ అనే పాటను విడుదల చేయగా దానికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీలోని రెండవ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు , ఆ తర్వాత తక్కువ రోజుల్లోనే ఈ మూవీ లోని రెండవ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అయింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క రెండవ సింగిల్ ను సంక్రాంతి పండగ తర్వాత విడుదల చేయాలి అని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకు ప్రధాన కారణం ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు చాలా సినిమాలు విడుదల కానుండడంతో ఆ మూవీల ప్రమోషన్ల మధ్యలో పెద్ది సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తే జనాల కాన్సన్ట్రేషన్ ఆ సాంగ్ వైపు వెళ్లడంతో సంక్రాంతి కి విడుదల కాబోయే సినిమాల ప్రమోషన్లపై ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపరు అని దానితో ఈ సంవత్సరం విడుదల కాబోయే సంక్రాంతి సినిమా బృందాలు పెద్ది సినిమా నుండి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను సంక్రాంతికి ముందు విడుదల చేయకండి అని అడగగా వారు కూడా సెకండ్ సింగిల్ విషయంలో వెనక్కు తగినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: