రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నీది అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ బృందం వారు కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే రేంజ్ అప్డేట్ విడుదల చేసింది. 

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా బుకింగ్స్ ను తాజాగా ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 8 వ తేదీ నుండే ప్రదర్శించనున్నట్లు కూడా ఈ మూవీ బృందం ఈ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతానికి రాజా సాబ్ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: