తెలంగాణలో అఖండ 2 సినిమా టికెట్స్ హైక్స్ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవోను సైతం కోర్టు కొట్టివేసింది. ధరలు పెంచుకొనే అవకాశాన్ని రద్దు చేస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే ప్రీమియర్ షోస్ కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అఖండ 2 చిత్రం డిసెంబర్ 12 నుంచి నార్మల్ టికెట్ ధరల్లోనే రిలీజ్ కాబోతోంది. ఈ విషయంపై అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.కానీ ఇప్పటికే తెలంగాణలో అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి. అది కూడా పెరిగిన టికెట్ ధరలకు అనుగుణంగా బుక్ అవ్వడంతో ఇప్పుడు ఆ ధరల జీవోని కోర్టు కొట్టి వేయడం జరిగింది.
నార్మల్ టికెట్ ధరలకే అందుబాటులో ఉంటాయని తేల్చి చెప్పింది కోర్టు. మరి ఎక్కువ ధర పెట్టీ టికెట్ కొన్న ఆడియన్స్ డబ్బులు రిటన్ ఇస్తారా? లేదా అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా టికెట్ కొన్న అభిమానులు మా డబ్బులు ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై అఖండ 2 మేకర్స్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనాప్పటికీ అఖండ 2 సినిమా విషయం లో మాత్రం వివాదాలు ఆగడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి