అఖండ 2 థియేటర్లలో రిలీజ్ అయిన వెంటనే వచ్చిన సూపర్ హిట్ టాక్‌ను చూసిన తర్వాత, సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా బాలయ్య సినిమా మీద అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించిన వారిపై ఘాటు కౌంటర్లు వరుసగా వెల్లువెత్తుతున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే అరాకొరా ప్రచారం చేస్తూ, అడ్డుకోవడానికి సిల్లీ ట్రిక్స్ ప్రయత్నించిన కొంతమంది ఇప్పుడు మాత్రం పూర్తిగా మూయబడ్డారు. ఎందుకంటే – ఫ్యాన్స్ ధీమాగా చెప్పినట్టే “అఖండ 2  హిట్ అవుతుంది” అన్న మాటకు నిజ రూపం దొరికింది.


సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన పాజిటివ్ టాక్, బాలయ్య పర్ఫార్మెన్స్, బోయపాటి మాస్ ట్రీట్ అన్నీ కలిసి అఖండ 2ని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ విజయాన్ని చూసిన తర్వాత బాలయ్య హార్డ్‌కోర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరింత గట్టిగా తమ స్వరం వినిపించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా, “బాలయ్య సినిమాను అడ్డుకున్నా, అరిచినా, కించపరిచినా—జనం ప్రేమ ముందు ఆ జిమ్మిక్కులు పనికిరావు” అని చెప్పుతూ, కౌంటర్లతో సోషల్ మీడియాను కదిలిస్తున్నారు.



ఇందులో ఎక్కువగా వైరల్ అవుతున్న కామెంట్స్ ఏంటంటే— “ఎవరైతే బాలయ్య సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నించారో… వాళ్లందరికీ ఈ సినిమా ఒక్కటే గుణపాఠం ఇచ్చింది. బాలయ్య దగ్గర ఎలాంటి చెత్త పనిచేయవు. ఆయన నడుచుకునేది నీతి, నిజాయితీ, నమ్మకం ఉన్న  అలాంటి హీరోకు ప్రజలు ఇచ్చే ప్రేమ అపారమైనది. అందుకే సినిమా హిట్ అవ్వడం సహజం.”


కొంతమంది మాత్రం మరింత ఘాటు‌గా కామెంట్ చేస్తున్నారు: “మీసాలు పెట్టుకున్నంత మాత్రానే పెద్దమనుషులు అవ్వరు… బ్రెయిన్ కూడా ఉండాలి! ఇంకా అర్థం కాకపోతే, కనీసం అఖండ 2 విజయంతో అయినా కొంతైనా తెలివి తెచ్చుకోండి. నెక్స్ట్ సినిమాల విషయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టి పిచ్చి ప్రచారాలు చేయడం మానేస్తే మీకే మంచిది.” అంటున్నారు,



ఇక సోషల్ మీడియాలో ఈ ఘాటు కామెంట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. బాలయ్య సినిమాను అడ్డుకోవాలని చూసిన వాళ్లంతా ఇప్పుడు గట్టిగానే కౌంటర్లు తిన్నట్టున్నారు. ఫ్యాన్స్ మాత్రం విజయోత్సాహంతో—
“బాలయ్య మీద ఎవరి జిమ్మిక్కులు పని చేయవు… ఆయన సినిమా వస్తే బ్లాస్టే!”అంటూ సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: