నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. అంతా ఓకే అయ్యి సినిమా విడుదల కి సమయం అత్యంత దగ్గర పడిన సమయం లో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 12 వ తేదీన విడుదల చేశారు. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 600 రూపాయల టికెట్ ధరను నిర్ణయించారు. దాదాపు ఆ టికెట్ ధరతోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శించారు.

ఇకపోతే ఈ మూవీ ప్రీమియర్ షో లకు కూడా జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా కూడా పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 8.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తుంది. ఇలా ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే భారీ ఎత్తున కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఈ మూవీ కి మొదటి రోజు కూడా మంచి కలెక్షన్లు దక్కినట్టు తెలుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: