అఖండ 2 విజయోత్సవ సభలో డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకు, సోదర సమానులైన నందమూరి అభిమానులకు ఈ సినిమాని ఈ స్థాయికి తీసుకువెళ్లిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది ఏ స్థాయిలో ఉందనేది పెద్దలు గౌరవనీయులందరూ కూడా మాట్లాడారు. ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలబడిన దిల్ రాజు గారికి, మ్యాంగో రామ్ గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ సురేంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఏం మ్యాజిక్ చేశారనేది మీరు స్క్రీన్ మీద చూసేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు పేరుపేరునా నా కృతజ్ఞతలు. భారతదేశం ధర్మ గ్రంథాలయం. భారతదేశ ధర్మానికి తల్లి వేరు లాంటిది. దాన్ని నమ్మిన దేశాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. నమ్మని దేశాలు ఇంకోలా ఉన్నాయి. మనిషి అనుకుంటే గెలవచ్చు ఓడిపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. అలా దేవుడు గెలిపించిన సినిమానే ఇది అని తెలిపారు.
ఈ సినిమా దేవుని సంకల్పం. దానికి మీరు అద్భుతంగా ఆదరించారు. మా ధర్మం ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం. అలా ముందుకు తీసుకొచ్చాం. అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఈ సినిమాని ఇంత అద్భుతంగా చేయగలిగామంటే కారణం బాలయ్య బాబు గారి సపోర్టు. ఆయన సపోర్ట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా చేయలేం. ఈ సినిమాని ప్రేక్షకులు మరింతగా ఆదరించి గొప్ప స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. విదేశాల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాని వాళ్ళ పిల్లలకు చూపిస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాని త్రీడీలో కూడా రిలీజ్ చేశాం. త్రీడీ లో ఉన్న షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. త్రీడీలో మీరు ఈ సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అభిమానులు అందరు కూడా త్రీడీలో చూడాలని కోరుకుంటున్నాను. ఒక కొత్త లోకం చూస్తారు. ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతి సినిమా బాగా ఆడాలని మా కోరిక. తెలుగు పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. మనందరం బాగుంటేనే ఈ దేశంలో మనం నిలబడగలం. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు అని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి