- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా “ అఖండ 2 ” డిసెంబర్ 12న విడుదలైంది. ఫ‌స్ట్ పార్ట్ హిట్ అవ్వ‌డం, బాలయ్య - బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో భారీ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్‌ను సాధించి అదరగొట్టింది. ఈ సినిమా లో కథానాయికగా సంయుక్త నటించగా, 'బజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీ మల్హోత్రా మరియు తరుణ్ ఖన్నా కీలక పాత్రల్లో మెప్పించారు. సినిమా విడుదలకు ముందు ఏర్పడిన కొన్ని ఆర్థిక వివాదాలను అధిగమించి, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


సాలిడ్ ప్రీమియర్స్ ఇంకా టికెట్ ధరల హైక్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన తాండవాన్ని మొదలుపెట్టింది. తెలంగాణాలో మొదటి వారాంతం ( మూడు రోజులు ) తర్వాతే సాధారణ టికెట్ ధరలకు వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇవాళ్టి ( బుధవారం, డిసెంబర్ 17 ) నుంచి సాధారణ టికెట్ ధరలు అమలులోకి వచ్చాయి. ఇది ఏపీలోని ప్రేక్షకులకు మంచి ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి, ఎందుకంటే అధిక ధరల కారణంగా సినిమా చూడటానికి వెనకడుగు వేసిన సాధారణ ఆడియెన్స్‌కు ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. నార్మ‌ల్ రేట్ల కే ఈ రోజు అఖండ తాండ‌వాన్ని థియేట‌ర్ల లో ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.


ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ‘అఖండ 2’ వసూళ్లు మంచి జంప్ అందుకుంటాయా అనేది చూడాలి. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట - గోపీ ఆచంట సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు. ఈ క్రేజీ సీక్వెల్ కు ఎస్‌. ఎస్‌. థమన్ తన పవర్‌ఫుల్ సంగీతాన్ని అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: