ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల రిలేషన్ చాలా కీలకం. వాళ్లిద్దరి మధ్య ట్యూనింగ్ ఎంత బాగుంటే సినిమా అవుట్ పుట్ అంత హెల్దీగా ఉంటుంది. సెట్లో గొడవ పడి వెళ్లిపోయిన నిర్మాతలు, అర్థాంతరంగా ప్యాకప్ చెప్పేసిన దర్శకుల లిస్టు చాంతాడంత ఉన్న ఈ రోజుల్లో, దర్శక నిర్మాత లిద్దరూ ఫ్రెండ్లీగా కలిసి పని చేసుకొంటూ, ఒకరికి ఒకరు గిఫ్టులు ఇచ్చుకొంటూ ముందుకు వెళ్లడం అరుదు. ప్రస్తుతం నిర్మాత నాగవంశీ తన దర్శకుడితో అలాంటి రిలేషన్ కోరుకొంటున్నారు. ఇక టాలీవుడ్ లో యంగ్ ప్రొడ్యుసర్ సితార నాగవంశీ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయనవన్నీ ఇన్‌స్టెంట్ నిర్ణయాలే. కథ నచ్చితే.. సింగిల్ సిట్టింగ్‌లోనే దర్శకుడికి అడ్వాన్సు ఇచ్చేస్తారు. దర్శకుడి పని తీరు నచ్చితే, సినిమా పూర్తవ్వకుండానే మరో ప్రాజెక్ట్ లాక్ చేస్తారు. ముఖ్యంగా, తన హీరోల్ని, దర్శకుల్ని ఖరీదైన గిఫ్టులతో పడేస్తారు.
ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒకటి. షూటింగ్ పూర్తయ్యింది. తాజాగా, ఈ సినిమా ఫస్టాఫ్ చూసిన నాగవంశీ సినిమా హిట్ పై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారని, అందుకే దర్శకుడికి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ గిఫ్ట్ ఖరీదు... దర్శకుడి పారితోషికం కన్నా కూడా ఎక్కువని తెలుస్తోంది. దర్శకుడికి నాగవంశీ ఇచ్చిన ఆ లగ్జరీ బహుమతి ఏమిటన్నది త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో బిగ్ హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు 'అనగనగా ఒక రాజు' ప్రమోషన్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. నవీన్ పొలిశెట్టి ఈ సినిమా ప్రమోషన్ బాధ్యత మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నాడు. త్వరలోనే సినిమా టీజర్ బయటకు రానుంది. సంక్రాంతి కి రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు లాంటి పెద్ద సినిమాల పోటీ మధ్యలో వస్తోన్న కూడా ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి