తెలుగు  బుల్లితెరపై బిగ్ బాస్ 9 మరి కొన్ని గంటలలో ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే కాబట్టి బిగ్ బాస్ విన్నర్ ఎవరనే విషయం తేలిపోనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫినాలే చీఫ్ ఈవెంట్ కోసం రవితేజ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్ మధ్య ఈ బిగ్ బాస్ టైటిల్ పోరు సాగుతుంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈసారి కప్ గెలుచుకోవడం ఖాయమని అభిమానులు కూడా ధీమాతో ఉన్నారు.


వీరిద్దరి తర్వాత మూడవ ప్లేసులో డిమాన్ పవన్ ఉన్నారు. నిన్నటి వరకు మూడవ స్థానంలో ఉన్న ఇమ్మాన్యుయేల్ శనివారం రోజున ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తోంది. అతనితో పాటుగా సంజన షో నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం. సంజన ఎలిమినేషన్ ఆశ్చర్యపరచలేదు, కానీ ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ మాత్రం అభిమానులను చాలా ఫీల్ అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ విన్నర్ అవుతారని అనుకున్నప్పటికీ కనీసం టాప్ 3లో లేకుండా ఎలిమినేట్ చేశారని ఫైర్ అవుతున్నారు.


హౌస్ లో మొదటినుంచి అందరితో బాగా చలాకీగా ఉన్న ఇమ్మాన్యుయేల్  తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ గెలుచుకున్నారు. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ తో చాలా స్నేహపూర్వకంగానే ఉన్నారు. టైటిల్ రేస్ లో ఉన్న తనుజా తో కూడా ఇమ్ము చాలా సరదాగా ఉంటారు. అయితే కారణాలు ఏదైనాప్పటికీ తనూజ, ఇమ్ము మధ్య బంధం చెడిపోవడంతో ఇది నెగిటివ్గా ఇమ్ము కి మారింది. ఇమ్మాన్యుయేల్ కు తక్కువ ఓటింగ్ కారణంగా బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇమ్మాన్యుయేల్ రోజుకి రూ.35000 వారానికి రూ. 2.25 లక్షల రూపాయల చొప్పున పారితోషకం తీసుకున్నట్లు వినిపిస్తోంది. అంటే మొత్తం 15 వారాలకు గాను రూ. 33,75,000 రూపాయల వరకు వస్తుందని సమాచారం. బిగ్ బాస్ విజేతకు రూ.50 లక్షలు ప్రైజ్ మనీ లభిస్తుంది ఈ లెక్కన చూస్తే విన్నర్ ప్రైజ్ మనీ కి దగ్గరలో సంపాదించినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: