లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఈ జనరేషన్లో ఏ హీరోయిన్ అయితే బాగా సెట్ అవుతుంది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది అనుష్కశెట్టి పేరు మాత్రమే. అయితే అలాంటి అనుష్క శెట్టి నటించిన అరుంధతి, భాగమతి,పంచాక్షరి, రుద్రమదేవి, నిశ్శబ్దం వంటి సినిమాలు ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా అరుంధతి తర్వాత అనుష్క శెట్టి రేంజ్ మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి అనుష్క శెట్టి ఈ ఏడాది ఘాటి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో మనం ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు  2025 లో విడుదలై భారీ డిజాస్టర్ అయిన సినిమాలలో ఘాటి సినిమా కూడా చేరిపోయింది.

అలా అనుష్క శెట్టి నుండి చాలా రోజుల నుండి వచ్చిన ఘాటీ మూవీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.కానీ అభిమానుల అంచనాలకి తగ్గట్టు సినిమా లేకపోవడంతో చివరికి బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ డిజాస్టర్ అయింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి లీడ్ రోల్ లో నటించారు.అలా ఎన్నోసార్లు వాయిదా పడుతూ చివరికి సెప్టెంబర్ 5న విడుదలైన ఘాటి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. అంతే కాదు ఈ సినిమాకి పోటీగా విడుదలైన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ భారీ విజయం అందుకుంది. అలా కంటెంట్ ఉంటే ఏ సినిమాని కూడా అడ్డుకోలేం అని లిటిల్ హార్ట్స్ మూవీ నిరూపించింది. అయితే అనుష్క నటించిన ఘాటి మూవీ పై ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాయి.కానీ బాక్సాఫీస్ వద్ద సినిమా రాణించలేకపోయింది.

దానికి కారణం సినిమాలో కథ లేకపోవడం ఒక్కటైతే అనుష్క బయటికి వచ్చి ప్రమోషన్ చేయకపోవడం మరో రీజన్ అయింది. ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హీరో హీరోయిన్ల సినిమాలైనా సరే ప్రమోషన్స్ లేకపోతే సినిమాని పట్టించుకునే వారే లేరు. కానీ అలాంటిది అనుష్క ఘాటి మూవీ కోసం బయటికి వచ్చి ఒక్కసారి కూడా ప్రమోషన్ చేయలేదు. కేవలం వాయిస్ నోట్స్ తోనే సరిపెట్టుకుంది.దాంతో అనుష్క ఘాటి మూవీ ప్రేక్షకుల్లోకి ఎక్కువగా వెళ్లలేదు.ఫలితంగా సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా రిజల్ట్ చూశాక అనుష్క సోషల్ మీడియాకి కూడా కొద్ది రోజులు దూరంగా ఉంటానని ఒక సంచలన పోస్ట్ పెట్టింది.మళ్లీ నూతన ఉత్సాహంతో తిరిగి మీ ముందుకు వస్తానని అనుష్క తన పోస్టులో పేర్కొనడంతో ఆమె అభిమానులు మరింత నిరాశ పడ్డారు. ప్రస్తుతం అనుష్క కథనార్ ది వైల్డ్ సోర్సెరర్ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. అలాగే భాగమతి -2 సినిమా కూడా చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: