కేజీఎఫ్ బ్యూటీ అనగానే అందరికీ  శ్రీనిధి శెట్టి గుర్తుకొస్తుంది. కన్నడ హీరో యష్ నటించిన  కేజీఎఫ్ 1, కేజీఎఫ్-2 రెండు సినిమాలతో శ్రీనిధి శెట్టికి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది.అలా కేజిఎఫ్ సినిమా తర్వాత యష్ తో పాటు శ్రీనిధి శెట్టికి కూడా పలు భాషల్లో అవకాశాలు వచ్చాయి. అలా శ్రీనిధి శెట్టి కేజిఎఫ్-2 తర్వాత తెలుగులో నాని హీరోగా వచ్చిన హిట్ -3 సినిమాలో కనిపించింది. శైలేష్ కొలను డైరెక్షన్లో వచ్చిన హిట్ మూవీ సీక్వెల్స్ హిట్ -3  వరకు కొనసాగింది.అలా నాని హీరోగా నటించిన హిట్ -3 లో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి ASP మృదుల IPS పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి తన యాక్టింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను పడగొట్టేసింది.

అలా భారీ అంచనాలతో హిట్-3 మూవీ సమ్మర్ లో మే 1న విడుదలైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఎప్పటిలాగే ముందు వచ్చిన హిట్, హిట్-2  సినిమాల లాగే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక శ్రీనిధి శెట్టి ఈ ఏడాదిలో నటించిన మరో సినిమా తెలుసు కదా.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా.. శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలై ఓ మోస్తరు హిట్ అందుకుంది. అలా ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ భార్య పాత్రలో రాశి ఖన్నా నటించగా.. ఆయన మాజీ ప్రియురాలిగా శ్రీనిధి శెట్టి నటించింది.ఇక ఈ మూవీలో శ్రీనిధి శెట్టి డాక్టర్ రాగా కుమార్ పాత్రలో కనిపించింది.

అలా రొమాంటిక్ డ్రామా జానర్ లో తెరకెక్కిన తెలుసు కదా మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ అందుకోవడంతో శ్రీనిధి శెట్టికి 2025 కలిసి వచ్చిన సంవత్సరంగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే మూవీలో నటిస్తోంది.ఇక టైటిల్ ని బట్టి చూస్తే శ్రీనిధి శెట్టి ఖాతాలో మరో హిట్ ఖాయం అని అర్థమవుతుంది. అలాగే తమిళంలో అజిత్ AK 64 సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కేజిఎఫ్ -3 లో కూడా శ్రీనిధి శెట్టి నే హీరోయిన్గా తీసుకోబోతున్నట్టు సమాచారం.ఇలా చేతినిండా ఆఫర్లతో శ్రీనిధి శెట్టి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: