ఇటీవల కొన్ని నెలల క్రితం ఏనుగుతొండం ఘటికాచలం చిత్రంతో అలరించిన రవిబాబు ఇప్పుడు తాజాగా మరో కొత్త కాన్సెప్ట్ సినిమాతో టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ చిత్రమే రేజర్. ఈ టైటిల్ గ్లింప్స్ మనుషులను ముక్కలు ముక్కలుగా రవిబాబు నరికేసినట్టుగా చూపించారు. సురేష్ ప్రొడక్షన్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రం రవిబాబే హీరోగా, డైరెక్టర్ గా కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
టైటిల్ గ్లింప్స్ విషయానికి వస్తే..ఒక వ్యక్తి చేతులు కట్టేసి రక్తం వచ్చేలా కొట్టినట్టుగా కనిపిస్తోంది. అనంతరం ఆ వ్యక్తి రెండు చేతులు మిగిలిపోయి మొండెంతో కింద పడిపోతారు. ఆ తర్వాత మరొక వ్యక్తిని రవిబాబు తన్నగా శరీరం రెండు భాగాలుగా విడిపోతుంది. మరొక వ్యక్తి తల రవిబాబు చేతిలో పట్టుకోగా ఆ వ్యక్తి తల రవిబాబు చేతిలో ఉండి మొండెం కిందికి పడిపోతుంది. ఆ తర్వాత రవిబాబు చూసి ఒక కిల్లింగ్ లుక్ టైటిల్ గ్లింప్స్ హైలెట్ చేస్తోంది. మరి ఈ సినిమాతో రవిబాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి. రేజర్ సంబంధించి వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి