టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , సూపర్ సాలిడ్ క్రేజ్ ను దక్కించుకున్న అతి కొద్ది మంది బ్యూటీలలో కృతి శెట్టి ఒకరు. ఈమె ఉప్పెన అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులకు బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకి వరుస పెట్టి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇక ఉప్పెన తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ ,  బంగార్రాజు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఆ తర్వాత మాత్రం ఈమె ఎన్నో సినిమాల్లో నటించినా ఏ మూవీ ద్వారా కూడా ఈమెకు తెలుగులో అద్భుతమైన విజయం దక్కలేదు. కొంత కాలం క్రితం ఈమె నటించిన మనమే సినిమా కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. 

ఈమెకు వరుసగా అపజయాలు దక్కడంతో తెలుగులో ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ఈమె ఇతర భాషల సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. తాజాగా ఈ బ్యూటీ తమిళ హీరో అయినటువంటి కార్తీ తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ సినిమాను తెలుగులో అన్న గారు వస్తారు అనే టైటిల్తో విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీని కొన్ని రోజుల క్రితం విడుదల చేయాల్సింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తెలుగులో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈమెకు తెలుగులో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. తాజాగా తమిళ్ సినిమాల్లో నటిస్తే ఆ సినిమా కూడా అనుకున్న సమయానికి విడుదల కాలేదు. దానితో కృతి శెట్టి కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks